రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ గంటసేపు నిలిపివేత

ABN , First Publish Date - 2021-06-25T22:16:30+05:30 IST

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత అకౌంట్‌ను ట్విట్టర్ గంటసేపు..

రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ గంటసేపు నిలిపివేత

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత అకౌంట్‌ను ట్విట్టర్ గంటసేపు శుక్రవారంనాడు నిలిపివేసింది. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద ఆయన అకౌంట్‌ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక గంట తరువాత అకౌంట్‌ను పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ''యూఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీరైట్ (డీఎంసీఏ) చట్టం ఉల్లంఘన కింద నా అకౌంట్‌ను యాక్సిస్ కాకుండా ట్విట్టర్ చేసింది. ఆ తర్వాత గంట సేపటికి ట్విట్టర్ యాక్సిస్‌కు అనుమతించింది'' అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021లోని రూల్ 4(8)ను పూర్తిగా ఉల్లంఘించడమేనని ట్విట్టర్ చర్యను మంత్రి ఖండించారు. వ్యక్తిగత అకౌంట్‌కు యాక్సిస్ నిరాకరించడానికి ముందు నోటీసు ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందన్నారు. కాగా, డీఎంసీఏ కింద ఏయే పోస్టులను ట్విట్టర్ తొలగించిందని వెంటనే తెలియరాలేదు. కొత్త ఐటీ రూల్స్‌కు ట్విట్టర్ కట్టుబడి ఉండాల్సిందేనని, అందులో ఎంతమాత్రం రాజీ లేదని కేంద్ర మంత్రి మరోసారి తెగేసి చెప్పారు.

Updated Date - 2021-06-25T22:16:30+05:30 IST