టీవీఎస్‌తో ‘ప్రకాశం’ ఒప్పందం

ABN , First Publish Date - 2022-05-24T03:32:57+05:30 IST

చెన్నై కేంద్రంగా ఉన్న టీవీఎస్‌ కార్పొరేట్‌ కంపెనీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీకి ఒప్పందం కుదిరిందని కర

టీవీఎస్‌తో ‘ప్రకాశం’ ఒప్పందం
టీవీఎస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వద్ద ప్రకాశం అధ్యాపకులు, విద్యార్థులు

  కందుకూరు, మే 23: చెన్నై కేంద్రంగా ఉన్న  టీవీఎస్‌ కార్పొరేట్‌ కంపెనీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీకి  ఒప్పందం కుదిరిందని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు పేరుగాంచిన టీవీఎస్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో తమ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ లభించటం  గర్వకారణమన్నారు. ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రతి సంవత్సరం ఫైనలియర్‌ విద్యార్థులకు టీవీఎస్‌ గ్రూప్‌ కంపెనీలో కోర్‌, సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మానవరహిత యంత్రాలతో వస్తు ఉత్పత్తి, ప్యాకింగ్‌ల తీరును విద్యార్థులకు వివరించటంతోపాటు వారికి ఆయా ల్యాబ్‌లలో ప్రత్యక్ష అవకాశం ఇవ్వనుండటం, విద్యార్థులు సాంకేతికంగా బలోపేతం అవుతారని అకడమిక్‌ ఇన్‌చార్జి ఎస్‌ఎం మీరావలి తెలిపారు.


Updated Date - 2022-05-24T03:32:57+05:30 IST