తునిలో మహిళలతో మాట్లాడుతున్న కృష్ణుడు
తుని టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు
తుని, జూలై 6: వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. తుని ఉప్పరగూడెంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో కృష్ణుడు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. మాజీ కౌన్సిలర్ సిద్దాంతపు సత్తిబాబు, కుక్కడపు బాలీజీ, మళ్ళ గణేష్, నెల్లిపూడి బ్రహ్మాజీ, వీవీజీ గుప్త, పాలిక శ్రీను, అప్పన రమేష్, దిబ్బ గోవిందు సాకా రామకృష్ణ, నరాలశెట్టి సత్య, పల్లెల హనుమంతు, మల్లిరెడ్డి చక్రఅప్పారావు, ఏలిశెట్టి వీరబాబు, బొద్దా సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.