ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2020-02-20T09:15:46+05:30 IST

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విఽధానాలతో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దేశ పౌరులంతా ఐక్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కాంగ్రె్‌సపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు.

ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

హిందూ ముస్లింల ఐక్యతతోనే దేశానికి రక్ష 

ఏప్రిల్‌ నుంచి అమలు చేసే ఎన్‌ ఆర్సీని వ్యతిరేకించండి : మధు


హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 19 : కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విఽధానాలతో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దేశ పౌరులంతా ఐక్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కాంగ్రె్‌సపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హిందూపురంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వారి సిద్ధాంతానికి నాంది పలికిందన్నారు. కమ్యూని్‌స్టలు ఉన్నంతకాలం బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ బ్రిటీ్‌షవారి అడుగులకు మడుగులు ఒత్తారని విమర్శించారు. టీడీపీ, వైసీపీ దొంగాట ఆడుతున్నాయని, అసెంబ్లీలో ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేయబోమని తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. తులసిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో నాలుగు మూలస్తంభాలు, నాలుగు దూలాలు ఉన్నాయన్నారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన దేశం ప్రమాదంలో పడుతుందన్నారు. ఆర్టికల్‌-14 ప్రకారం అందరూ సమానమని రాజ్యాంగం చెబుతుంటే కొందరికే పౌరసత్వం అంటూ నిబంధనలు విధించడం అన్యాయమన్నారు.


మత ఐక్యతకు విఘాతం కలిగించే పౌరసత్వ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు. ముస్లింలకు మాత్రమే దేశంలో అవకాశం లేదన్న నిబంధన దుర్మార్గమన్నారు. 1973లో బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాది మంది మన దేశంలోకి శరణార్థులుగా వచ్చారన్నారు. ప్రజాస్వామ్య విలువలు, లౌకికతత్వానికి గొడ్డలిపెట్టుగా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జగదీశ్‌, సీపీఎం నాయకులు ఇంతియాజ్‌, దాదాపీర్‌, రామకృష్ణ, వెంకటేశ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాలాజీమనోహర్‌, నాయకులు నాగరాజు, శైవలి రాజశేఖర్‌, సంపత్‌, రహమత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:15:46+05:30 IST