- తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
అడయార్(చెన్నై), జూన్ 30: పార్టీకి చెందిన సీనియర్ నేతలు, పార్టీ నిర్వాహకులతో ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం అత్యవసరంగా భేటీ అయ్యారు. రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి సెందమిళన్, రంగస్వామి, కోశాధికారి తిరుచ్చి మనోహరన్, ప్రచార విభాగ కార్యదర్శి సీఆర్ సరస్వతి, ప్రధాన కార్యాలయ ప్రధాన కార్యదర్శి షణ్ముగవేల్, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శుల సహా దాదాపు 300 మంది వరకు హాజరయ్యారు. పార్టీ నేతలు, నిర్వాహకుల నుంచి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై దినకరన్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వంపై ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో దినకరన్.. తమ పార్టీ కీలక నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి