కార్యకర్త నుంచి అధ్యక్షుడిగా.. !

ABN , First Publish Date - 2021-07-20T05:09:11+05:30 IST

తెలుగుదేశం పార్టీలో 35సంవత్సరాల

కార్యకర్త నుంచి అధ్యక్షుడిగా.. !
బక్కని నర్సింహులు

షాద్‌నగర్‌అర్బన్‌: తెలుగుదేశం పార్టీలో 35సంవత్సరాల క్రితం సాధారణ కార్యకర్తగా అడుగుపెట్టిన బక్కని నర్సింహులు పార్టీకి వివిధ హోదాల్లో సేవలిందిస్తూ రాష్ట్ర అధ్య క్షుడి స్థాయికి ఎది గారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఫరూఖ్‌నగర్‌మండల శాఖఅధ్యక్షుడిగా పనిచేసిన నర్సింహులు ఆ తరువాత షాద్‌నగర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా, టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా పనిచేసి, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 


చంద్రబాబుకు నమ్మిన బంటు.. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు నర్సింహులు నమ్మిన బంటుగా పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం ఏ పని చెప్పినా కాదనకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీల పోత్తులో భాగంగా షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని ఇతర పార్టీలకు ఇచ్చినా ఓర్పుతో టీడీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం పనిచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారన్న నమ్మకంతోనే నర్సింహులుకు అధ్యక్ష పదవిని అప్పగించారు. 



Updated Date - 2021-07-20T05:09:11+05:30 IST