టీటీడీ ఆస్తులను పరిరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2020-05-25T10:13:10+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలను పరిరక్షించుకోవడం ఎంతో

టీటీడీ ఆస్తులను పరిరక్షించుకోవాలి

నాయుడుపేట, మే 24 : తిరుమల తిరుపతి దేవస్థానాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలను పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. తమిళనాడులో ఉన్న ఏడుకొండల వెంకన్న ఆస్తులను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  భక్తులు కోరుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భూముల్లో ఆధ్యాత్మిక, తిరుమల, తిరుపతి దేవస్థానాల సర్వీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచిది అంటున్నారు. ఫలితంగా అనేక మందికి ఉపాధితోపాటు ఆయా ప్రాంతాల ప్రజలు శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని పలువురు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో తమ మనో గతం పంచుకున్నారు.


భక్తుల మనోభావం దెబ్బతింటుంది 

కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి  ఆస్తులను అమ్మితే భక్తుల మనోభావం దెబ్బతింటుంది. 

-నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ  సభ్యుడు 


శ్రీవారి ఆస్తులను పరిరక్షించుకోవాలి 

శ్రీవారి కోసం వివిధ ప్రాంతాల్లో భక్తులు సమర్పించుకున్న ఆస్తులను పరిరక్షించుకోవాలి. భవిష్యత్తులో అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 

 -మాల్యాద్రినాయుడు, బీజేపీ జిల్లా కార్యదర్శి 


ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు

శ్రీవారి భూముల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టవచ్చు. శ్రీవారి ఆస్తుల విలువలు పెరుగుతుండటం భావితరాలకు ఎంతో ఉపయోగకరం.

సుధీర్‌,  బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ సమన్వయకర్త 


ఆస్తులు ఆదాయ వనరులుకాదు 

 వెంకటేశ్వరస్వామికి సమర్పించుకున్న ఆస్తులు దైవ కార్యక్రమాలకే చెందేలా ఉండాలి.  వాటిని ఆదాయ వనరులుగా పరిగణించకూడదు. 

  మురళీ, విశ్వహిందూపరిషత్‌ నాయకులు


వేలం ఉపసంహరించుకోవాలి 

వెంకన్న ఆస్తుల వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.  భక్తులు విరాళాల రూపంలో ఇచ్చిన భూముల్ని వేలం వేయడం మంచి పద్ధతి కాదు. 

-రవీంద్ర, బ్రాహ్మణసేవాసంఘం జిల్లా కార్యదర్శి 

Updated Date - 2020-05-25T10:13:10+05:30 IST