సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పాలన

ABN , First Publish Date - 2022-09-29T05:42:11+05:30 IST

సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని, నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌ నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పాలన
పెన్షన్‌ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్‌

 ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

జ్యోతినగర్‌ సెప్టెంబరు 28: సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని, నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌ నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీపీసీలోని ఒక ఫంక్షన్‌హాలులో 2, 3, 4, 5, 23 డివిజన్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్‌ కార్డులను ఎమ్మెల్యే చందర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర అట్టడుగు వర్గాలను ఆదుకునేందుకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మనసున్న సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయల పెన్షన్‌ను అందజేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాలు, కులాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నా రు. ఎన్నో సంవత్సరాలుగా రామగుండం ప్రాంత ప్రజల స్వప్నమైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేశారని, త్వరలోనే వైద్య కళాశాలలో విద్యా భోదన మొదలవుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యేగా తాను చిత్తశుద్ధితో పని చేస్తున్నానని ఎమ్మెల్యే చందర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు ఎన్‌వి.రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్‌, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు బుర్ర శంకర్‌గౌడ్‌, కుమ్మరి శారద, వీరాలాల్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:42:11+05:30 IST