తుది దశకు టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-19T05:45:21+05:30 IST

మునుగోడులో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యే టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

తుది దశకు టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ ఏర్పాట్లు
టీజేఎస్‌ మునుగోడు నియోజకవర్గ కన్వీనర్‌ నాగిళ్ల శంకర్‌కు గులాబీ కండువా కప్పుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

మునుగోడు, ఆగస్టు 18 : మునుగోడులో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యే టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పర్యవేక్షణలో వారం రోజుల నుంచి సభా ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మంత్రి జగదీ్‌షరెడ్డి గురువారం సభా ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రధానంగా వేదిక వద్ద సౌకర్యాలను నిర్వాహకులను అడిగితెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, మార్నేని సుదీర్‌రావు, నారబోయిన రవిముదిరాజ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, రుషిగౌడ్‌, ఏరుకొండ శ్రీనివాస్‌, ఏరుకొండ నాగరాజు, ఈద శరత్‌బాబు, జంగిలి నాగరాజు, కుమారస్వామి, వనం సురేష్‌, రవి పాల్గొన్నారు. అదేవిధంగా సభా స్థలాన్ని ఎస్పీ రెమారాజేశ్వరి పరిశీలించారు. ప్రజలకు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు రూట్‌ మ్యాప్‌ వంటి ఏర్పాట్లపై స్థానిక పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట డీఎస్పీ నంద్యాల నర్సింహారెడ్డి, సీఐలు అశోక్‌రెడ్డి, ఆదిరెడ్డి, ఎస్‌ఐలు సతీ్‌షరెడ్డి, నవీన్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-19T05:45:21+05:30 IST