హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఎల్పీ భేటి జరుగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులకు సమావేశానికి ఆహ్వానం పంపారు. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం అవలంభిస్తున్న విధానంపై చర్చించనున్నారు. కేంద్రంపై పోరుకు కేసీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ నెల 29 న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.