Abn logo
Aug 8 2020 @ 03:03AM

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యూనిఫాంపై త్రివర్ణ ప్యాచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది ధరించే నారింజ రంగు యూనిఫాంపై ఇకపై త్రివర్ణ ప్యాచ్‌ ఉండనుంది. గత ఏడాది ఆగస్టులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అధికారులు ప్రధాని మోదీతో జరిపిన సమావేశంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యూనిఫాంలో మార్పులపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా సంబంధిత అధికారులు యూనిఫాంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యూనిఫాంలో చాతీకి ఎడమవైపు త్రివర్ణ ప్యాచ్‌ ఉండాలని సూచించారు. అలాగే, వారి చొక్కాపై రేడియం స్ట్రిప్స్‌ ఉండాలని చెప్పారు. చొక్కా కుడి వైపు పై భాగంలో ‘ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇండియా’ అని రాసి ఉండాలని సూచించారు. ఇతర ఫొటోలు, పేర్లు ఉండకూడదని చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement