రహదారి విస్తరణ పనులతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-12-22T06:17:08+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో చేపట్టిన ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ పనులతో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం క లుగుతుంది.

రహదారి విస్తరణ పనులతో ఇక్కట్లు
అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు

రహదారిపై పారుతున్న మురికి నీరు 

దుమ్ముతో స్థానికుల అవస్థలు  

త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటున్న ప్రజలు

భువనగిరిటౌన, డిసెంబరు21: జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో చేపట్టిన ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ పనులతో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం క లుగుతుంది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి పాత బ స్టాండ్‌ వరకు 2.120 కిలోమీటర్ల దూరం చేపట్టిన రహదారి విస్తరణ పనులతో పట్టణ ప్రధాన రహదారి గజిబిజిగా మారింది. రహదారికి ఇరువైపులా కూల్చివేత ప నులు, భవనాల పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాక ఒకవైపు ప్రధాన మురికి, వరద నీటి కాల్వ పనులు జరుగుతున్నాయి. నూతన నిర్మాణాల సామగ్రి, భవనాల కూల్చివేతతో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల కుప్పలు రహదారి వెంట పేరుకుపోయి చిన్నపాటి వాహనం, గాలి వీచినా దుమ్ము లేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పాత మురికికాల్వలు ధ్వంసమవడంతో మురుగునీరు రహదారులపై ప్రవహిస్తుంది. నూతన మురికికాల్వ నిర్మాణం కోసం చేస్తున్న తవ్వకాల కారణంగా ఊరుతున్న నీటిని మోటార్ల ద్వారా ప్రధాన రహదారిపై ఎత్తిపోస్తున్నారు. దీంతో రహదారి మురికిమయంగా మారింది. అలాగే పనులకు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు పలు ప్రాంతాల్లో రహదారికి ఒకే వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తుండటంతో వాహనాలు పలు మార్లు ఎక్కడిక్కడే నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ సమస్య ను తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాలు, కార్లు,   ఆటోలు తదితర తేలికపాటి వాహనాలు బస్తీల రహదారి గుండా వెళ్తుండటంతో రహదారి వెంట గల బస్తీల్లో వాహన సంచారం పెరగడంతో ఆ యా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 



పనులను సకాలంలో పూర్తి చేస్తాం  

ఆంజనేయులు, మునిసిపల్‌ చెర్మన, భువనగిరి 

పట్టణ అభివృద్ధి కోసం చేపట్టిన 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను సకాలంలో పూర్తి చేస్తాం. ప నులు వేగవంతంగా సాగేందుకు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ప్రతీ రోజు ప ర్యవేక్షిస్తున్నారు. విస్తరణ పనులతో ఎదురవుతున్న ఇబ్బందులు తాత్కాలికమే. పనులు పూర్తయ్యాక పట్టణ రూపురేఖలు మారుతాయి. అప్ప టి వ రకు ప్రజలందరూ సహకరించాలి. 

Updated Date - 2021-12-22T06:17:08+05:30 IST