Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైన రమ్యాకర్‌కు సన్మానం

బాపట్ల: ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌, కాంపిటీషన్స్‌లో భాగంగా విజయవాడలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రకబడ్డీ జట్టుకు ఎంపికైన యారం రమ్యాకర్‌ను వైసీపీ దళిత రాజకీయ చైతన్యవేదిక నాయకులు ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఘనంగా సన్మానించారు. బాపట్ల మండలం కొండుభొట్లపాలెం గ్రా మానికి చెందిన రమ్యాకర్‌ కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామసచివాలయ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగం చేస్తూ క్రీడలపట్ల ఆసక్తితో రాష్ట్రజట్టుకు ఎంపికకావటం సంతోషదాయకమని వేదిక నాయకులు జోగి రాజా, అడే క్యాత్రిన్‌, తురిమెళ్ళ అమ్మేశ్వరరావు, తానికొండ ఆనంద్‌, అడే చంద్‌, పులి శ్రీను, పవన్‌  పాల్గొన్నారు.


Advertisement
Advertisement