చేజారితే...ప్రాణాలు నీటిలో కలిసినట్లే

ABN , First Publish Date - 2020-10-15T06:57:21+05:30 IST

నెలరోజుల క్రితం పుట్టిన పసికందును వైద్యం కోసం తరలించేందుకు చేసిన సహసం ఇది.

చేజారితే...ప్రాణాలు నీటిలో కలిసినట్లే

గుండాల మండలంలోని మల్లన్నవాగుతో గిరిజనుల కష్టాలు


గుండాల, అక్టోబరు 14: నెలరోజుల క్రితం పుట్టిన పసికందును వైద్యం కోసం తరలించేందుకు చేసిన సహసం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలంలోని నర్సాపురం తండా గ్రామానికి చెందిన మాలోత్‌ బిక్షపతి కొడుకు 45 రోజుల క్రితం జన్మించాడు. బుధవారం టీకా వేయించేందుకు గుండాల పీహెచ్‌సీకి తీసుకెళ్లాల్సి ఉండగా మార్గమధ్యంలో మల్లన్నవాగు ఉప్పొంగుతోంది. వాగుపై సోమవారం నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకపోవడంతో, చంటిబాబును చేతులపై ఎత్తుకుని, పైపులపై కొంతదూరం తీసుక వచ్చాకా, మధ్యలోనుంచి ఇసుప చానల్‌పై అత్యంత ప్రమాదకర స్థితిలో  పసికందును ఎత్తుకుని వాగు దాటించి టీకా మందు వేయించారు. తిరుగు ప్రయాణంలో వాగు ప్రవహం తగ్గడంతో స్వగ్రామానికి సురక్షితంగా వెళ్లారు.  

Updated Date - 2020-10-15T06:57:21+05:30 IST