గిరిజన రైతుల్ని ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-05-21T06:42:27+05:30 IST

గిరిజన ప్రాంత రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు.

గిరిజన రైతుల్ని ప్రోత్సహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


 జిల్లా వ్యవసాయ సలహా మండలిలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

పాడేరు, మే 20(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుగిరిజన ప్రాంత రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి  తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, వాటికి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే రాజ్‌మాలో అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను రైతులకు అందించాలన్నారు. అంతర పంటగా ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సహించాలని, వీటికి మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించాలన్నారు. గిరిజన రైతులకు బిందు సేద్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగు తక్కువగా ఉందని, వాటి విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. మత్స్యపరిశ్రమపై గిరిజనులకు ఆసక్తి ఉందని, అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఔషధమొక్కల పెంపకం, మార్కెటింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. తాము అల్లం సాగు చేస్తున్నామని, కాని మార్కెటింగ్‌ సదుపాయం లేక ఇళ్లల్లోనే నిల్వ ఉంచామని హుకుంపేటకు చెందిన ఓ రైతు తెలిపారు. దానిపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ అల్లాన్ని సొంటిగా మార్చేసి, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఉద్యానవనాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండలి చైర్‌పర్సన్‌ ఎం.సరస్వతి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఈఈ సీతారామునాయుడు, ఏపీ సీడ్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ త్రినాఽథ్‌, నాబార్డు ఏజీఎం శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ ఏడీ రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:42:27+05:30 IST