వార్డుల్లో ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-06-19T05:47:58+05:30 IST

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నా యక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహి స్తున్న నర్సరీలను, ట్రీ పార్కులను, మియావాకి ప్లాంటేషన్‌లను కలెక్టర్‌ పరిశీలించారు.

వార్డుల్లో ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలి
మియావాకి పార్కులో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 18: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నా యక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహి స్తున్న నర్సరీలను, ట్రీ పార్కులను, మియావాకి ప్లాంటేషన్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. స్థానిక టీటీడీసీ, గాంధీపార్కులలోని నర్సరీలు, దుర్గాన గర్‌లోని మియావాకీ ప్లాంటేషన్‌, న్యూహౌజింగ్‌బోర్డులోని ట్రీ పార్కుల ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నర్స రీల్లో పెద్ద మొక్కలను పెంచాలని ఇంటింటికీ పంపిణీ చేసి పూలు, పండ్ల మొక్కలను ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పెంచాలని సూచిం చారు. రోడ్లకు ఇరువైపులా మల్టీలేయర్‌ క్రమంలో మొక్కలను నాటేం దుకు పెద్ద మొక్కలను సమకూర్చుకోవాలని అన్నారు. పార్కులు, నర్సరీ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, సహాయ మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:47:58+05:30 IST