మొటిమల బాధ పోవాలంటే...
ABN , First Publish Date - 2020-08-10T05:30:00+05:30 IST
మొటిమల సమస్య టీనేజర్లలో బాగా కనిపిస్తుంది. అయితే చర్మతత్వాన్ని బట్టి చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటంటే...
మొటిమల సమస్య టీనేజర్లలో బాగా కనిపిస్తుంది. అయితే చర్మతత్వాన్ని బట్టి చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటంటే...
- సాధారణ చర్మం అయితే అన్ని రకాల ప్యాక్స్ పడవు. తేనె కాంబినేషన్స్‌తో కూడిన ప్యాక్స్ మాత్రమే సరిపోతాయి. అలాగే, సబ్బుతో కాకుండా మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి.
- పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఉన్న క్రీమ్స్, ప్యాక్స్ వేసుకోవడం మంచిది. పాలతో మిక్స్ చేసే ప్యాక్స్ వేసుకోవచ్చు. అలాగే ముల్తానీ మట్టి, శనగపిండి అప్పుడప్పుడు వాడొచ్చు. పొడిచర్మం ఉన్నవారు నిమ్మ, ఆరెంజ్‌లాంటివి వాడొద్దు. వీటిని వాడితే చర్మం మరింతగా పొడిబారి పోతుంది. కలబంద వాడితే మంచి ఫలితం ఉంటుంది.
- జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్ ఫేస్ వాష్, ప్యాక్స్ ఎక్కువ వాడాలి.
- మిశ్రమచర్మం ఉన్నవారు ముందుగా తమకు ఏ ప్యాక్స్ సరిపోతాయో చూడాలి.
- కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు పోవు. అలాంటప్పుడు దానికి మూలకారణం ఏమిటో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి.