Abn logo
May 20 2020 @ 05:32AM

వాట్సప్‌ ద్వారా రవాణాశాఖ సేవలు

ప్రొద్దుటూరు క్రైం, మే 19 : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ క్రమంలో ప్రజలు రవాణాశాఖ కార్యాలయానికి రాకుండా నే వాట్స ప్‌ నెంబర్‌ 9666898005 ద్వారా రవాణాశాఖ సేవలు పొం దవచ్చని ప్రొద్దుటూరు ప్రాంతీయ రవాణాశాఖాధికారి ఎం.వీర్రాజు తెలిపారు. శాఖాపరమైన ఏ సమాచారంనైనా ఉదయం 10.30 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వర కు పైన పేర్కొన వాట్సప్‌ నెంబరుకు పోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎల్‌ఎల్‌ఆర్‌, కొత్త డ్రైవిం గ్‌ లైసెన్స్‌ స్లాట్‌ బుకింగ్‌ తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు.


సెకెండ్‌ హ్యాం డ్‌ వెహికల్‌ వెరిఫికేషన్‌, సీజ్‌ చేసిన వాహనాల విడుదల కోసం సదరు వాట్సప్‌ నెంబరుకు సమాచారం ఇస్తే, వాటిని పరిష్కరిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చిన వారు భౌతికదూరం పాటించి, ఫేస్‌మాస్క్‌ లు ధరించాలన్నారు. అన్‌లైన్‌లో శాఖాపరంగా సేవలు పొందేటప్పుడు సరైన చిరునామాలను పొందుపరచని కారణంగా ఆర్‌సీ, డీఎల్‌ సంబంధించిన స్మార్ట్‌కార్డులు తిరిగి కార్యాలయానికి చేరుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌కార్డులను కార్యాలయంలోనే అందజేస్తారన్నారు. 

Advertisement
Advertisement
Advertisement