తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ

ABN , First Publish Date - 2020-09-27T10:42:58+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఉద్యమస్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 125వ జయంతి

తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం, సెప్టెంబరు 26(ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఉద్యమస్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా మంత్రి అజయ్‌ శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తికోసం చాకలి ఐలమ్మ నిజాంలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేశారు. రజాకార్ల గుండెంల్లో రైళ్లుపరుగెత్తించిన ఐలమ్మ మలిదశ తెలంగాణ ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చారన్నారు. చాకలి ఐలమ్య స్పూర్తితోనే రైతులకు భూములుపై సర్వ హక్కులు ఉండాలని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారన్నారు. ఈ చట్టంతో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తూ కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూరుస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌ సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ గుండాల కృష్ణ, కమర్తపు మురళి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T10:42:58+05:30 IST