పూజలు చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
పోలవరం, డిసెంబరు 2: పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయాన్ని ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పి.సీతారామంజనేయులు, అదనపు కమిషనర్ పి.ప్రసాదరావు గురువారం దర్శించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో సంగ మేశ్వరశర్మ వారికి పట్టు వస్త్రాలు అందించారు. హుకుంపేట జమీందార్ హోతా వీరభద్రరావు వీరభద్రుడికి లక్షపత్రిపూజ నిర్వహించారు.