Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొద్ది గంటల్లో పెళ్లి.. వరుడు వెళ్తున్న కారును ఆపేసిన హిజ్రాలు.. డబ్బులడిగితే ఇవ్వలేదని చేసిన నిర్వాకమిది..!

ఇంటర్నెట్ డెస్క్: మరికాసేపట్లో అతని పెళ్లి జరగనుంది. పెళ్లి కొడుకు వస్త్రధారణలో కార్లో కూర్చొని ఊరేగింపుగా కాబోయే భార్య వాళ్ల ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై వెళ్తుండగా కొందరు హిజ్రాలు.. పెళ్లికి వెళ్తున్న కార్లను అడ్డుకున్నారు. తమకు ‘బక్షీస్’ ఇవ్వాలని అడిగారు. ఇది వారికి మామూలే.. దీంతో కొంత సొమ్ము ఇవ్వబోతే హిజ్రాలు ఒప్పుకోలేదు. తమకు ఎక్కువ మొత్తం డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కారులోని వరుడికి కోపం వచ్చింది. వారికి పైసా కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. అయితే ఈ కథ అక్కడితో ఆగలేదు. బిహార్‌లోని వైశాలి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి సరాయ్ టోల్‌ప్లాజా వద్ద పెళ్లి కొడుకు వాహనాన్ని హిజ్రాలు అడ్డుకున్నారు.


వారికి డబ్బులు ఇవ్వకుండా టోల్ ప్లాజా దాటిన వరుడు.. ఒక పెట్రోల్ బంకు వద్ద పెట్రోలు కోసం ఆగాడు. అంతే మూకుమ్మడిగా అక్కడకు వచ్చేసిన హిజ్రాలు.. తమలో ఒకరిని ఆ కారు గుద్దేసిందంటూ ఆరోపించడం ప్రారంభించారు. పెళ్లి కొడుకు బంధువులతో కొట్లాటకు దిగారు. ఈ గొడవ మరీ పెద్దది అయిపోవడంతో స్థానికులు గుమిగూడారు. ఈ డ్రామా మొత్తం పెట్రోలు బంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఎంత సేపటికీ ఈ గొడవ సద్దుమణగలేదు. దీంతో చిరాకు పడిన పెళ్లి కొడుకు.. కారు స్పీడు పెంచి వేగంగా వెళ్లిపోయాడు. దీంతో హిజ్రాల ఆగ్రహం మరింత ఎక్కువైపోయింది. భయంకరమైన తిట్లు తిడుతూ పెట్రోలు బంకులో నానా హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పెట్రోలు బంకు యాజమాన్యంతో కలిసి వారికి నచ్చజెప్పారు. కాసేపటి తర్వాత హిజ్రాలంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement