మంగళమడకలో పేలిన ట్రాన్సఫార్మర్‌

ABN , First Publish Date - 2021-08-06T06:36:58+05:30 IST

మండల పరిధిలోని మంగళమడక గ్రామంలో హై ఓల్టేజ్‌తో ట్రాన్స ఫార్మర్‌ పేలింది. ఆ సమయంలో గ్రామానికంతా విద్యుతసరఫరా అయ్యింది.

మంగళమడకలో పేలిన ట్రాన్సఫార్మర్‌

- గ్రామానికంతా పాకిన విద్యుత సరఫరా

- విద్యుదాఘాతంతో మహిళ మృతి

-  స్పందించని విద్యుత అధికారులు.. ఆందోళనలో గ్రామస్థులు

ముదిగుబ్బ, ఆగస్టు5: మండల పరిధిలోని మంగళమడక గ్రామంలో హై ఓల్టేజ్‌తో ట్రాన్స ఫార్మర్‌ పేలింది. ఆ సమయంలో గ్రామానికంతా విద్యుతసరఫరా అయ్యింది. ఆ సమయంలో గ్రా మ మాజీ సర్పంచ శ్రీరామిరెడ్డి భార్య ప్రమీల మ్మ(65) తన ఇంటిముందు ఉన్న ఇనుప గేటు కు తాకడంతో షాక్‌ గురై మృతిచెందింది.. గు రువారం సాయంత్రం గ్రామంలో హై ఓల్టేజ్‌తో ట్రాన్సఫార్మర్‌ పేలి శబ్దాలు వచ్చాయి. దీంతో   గ్రామస్థులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అదేవిధంగా ప్రతి ఇంటిలో ఎలక్ర్టికల్‌ వస్తు వులు, విద్యుతమీటర్లు కాలిపోయాయి. విష యం తెలు సుకున్న పోలీసులు సంంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే నష్టం భారీగా జరిగి ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ట్రాన్సకో అధికారులకు పోన చేయగా స్విచ ఆఫ్‌ వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-06T06:36:58+05:30 IST