Advertisement
Advertisement
Abn logo
Advertisement

జేసీ లక్ష్మీశ బదిలీ

జీవీఎంసీ కమిషనర్‌గా నియామకం 

 జేసీ-2 కీర్తి చేకూరికి పూర్తి బాధ్యతలు

 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

కాకినాడ సిటీ, అక్టోబరు 23: జిల్లా జాయింట్‌ కలె క్టర్‌ (రెవెన్యూ) జి.లక్ష్మీశ బదిలీ అయ్యారు. ఈయన ను గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీశ 2019 జూలై 28న జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరగా ఇప్పటికి రెండేళ్లు దాటింది. తిరుపతి అర్బన్‌ డవలప్‌మెంట్‌ అఽథారిటీ (తుడా)కి బదిలీ కోసం ఈయన ప్రయత్నించారు. అయితే ఈయనను జీవీఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో జేసీ-2 కీర్తి చేకూరికి పూర్తి బాధ్యతలు అప్పగి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీవో నంబరు 1766 విడుదల చేసింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మాయాజాలం విషయంలో అధికార పార్టీలోని కీలక నేత సూచనల మేరకు చూసీచూడనట్టు వ్యవహరించారని, గనుల అక్రమాల విషయంలో అధికార పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆ వ్యవహారంపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వినిపించాయి.Advertisement
Advertisement