టీచర్ల బదిలీలు షురూ

ABN , First Publish Date - 2021-01-14T06:25:00+05:30 IST

ఎట్టకేలకు టీచర్ల బదిలీలకు ప్రభుత్వం విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా బుఽధవారం అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులందాయి.

టీచర్ల బదిలీలు షురూ
విశ్రాంత డీఈవో పాండురంగస్వామి సంతకంతో వచ్చిన బదిలీ ఉత్తర్వు

 విశ్రాంత డీఈవో సంతకంతో ఉత్తర్వులు రావడంపై ఆందోళన 


చిత్తూరు(సెంట్రల్‌), జనవరి 13: ఎట్టకేలకు టీచర్ల బదిలీలకు ప్రభుత్వం విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా బుఽధవారం అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులందాయి. అయితే ఏడాదిన్నర కిందట పదవీ విరమణ చేసిన విశ్రాంత డీఈవో పాండురంగస్వామి సంతకంతో కూడిన ఆర్డర్‌ కాపీలు అందడంపై ఆందోళన చెందుతున్నారు. ఏడీ పురుషోత్తం స్పందిస్తూ.. ప్రస్తుత డీఈవో నరసింహారెడ్డి డిజిటలైజ్డ్‌ సంతకాన్ని ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. ఈ విషయమై రాష్ట్రస్థాయి అధికారులకు తెలియజేయగా, సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 

తొలుత ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలకు.. 

సంక్రాంతి పండుగతో ఈనెల 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో 16వతేదీ నుంచి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీ)ల బదిలీ ఉత్తర్వుల ప్రక్రియ వేగవంతం కానుంద.ఇ ఇందులో భాగంగానే తొలుత ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలకు(పీఎ్‌సహెచ్‌ఎం) రాష్ట్ర విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు పంపింది. ఆ మేరకు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న నలుగురు హెచ్‌ఎంలు(తెలుగు), జడ్పీ పాఠశాలలకు చెందిన 90 మంది, ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం ఒకరు, జడ్పీ హెచ్‌ఎంలు ముగ్గురు, జడ్పీ(తమిళం) ఓ హెచ్‌ఎం ఆన్‌లైన్‌ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన అందరికీ విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు పంపింది. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌(ఎ్‌సఏ) మ్యాథ్స్‌, సోషియల్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయోలజికల్‌ సైన్స్‌ టీచర్లకు గురువారం బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. గురు, శుక్రవారం బదిలీ ఉత్తర్వులు అందినా.. రిలీవ్‌, జాయినింగ్‌కు టీచర్లకు సమయం అవసరం. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘ నేతలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు విన్నవించగా, కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2021-01-14T06:25:00+05:30 IST