భారీగా తహసీల్దార్ల బదిలీలు

ABN , First Publish Date - 2022-07-03T04:44:49+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన జరిగిన తహసీల్దార్ల బదిలీలు అధికార వైసీపీ ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేలా ఉన్నాయి.

భారీగా తహసీల్దార్ల బదిలీలు

మూడు జిల్లాల్లో కలిపి 54 మందికి ట్రాన్స్‌ఫర్లు 

ఎక్కువగా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మార్పులు


గుంటూరు, జూలై2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన జరిగిన తహసీల్దార్ల బదిలీలు అధికార వైసీపీ ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేలా ఉన్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు కలిపి మొత్తం 54 మందిని వేర్వేరు మండలాలకు పోస్టింగ్‌లు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన పల్నాడు, బాపట్ల జిల్లాల అధికారులతో కూడిన కమిటీ భేటీ అయి చర్చించుకొని ఈ బదిలీలు చేశారు.  

జిల్లాల విభజనకు ముందు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులకు సిఫార్సులు చేసివారికి కావాల్సిన మండలాల్లో తహసీల్దార్లకు పోస్టింగ్‌ చేయించుకొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆ డిప్యూటేషన్లు రద్దయ్యాయి. కాగా ఇప్పుడు జరిగిన సాధారణ బదిలీల్లో కొంతమంది తహసీల్దార్లు తమ పాత పోస్టింగ్‌లను దక్కించుకొన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఫిరంగిపురం తహసీల్దార్‌ కె.సాంబశివరావుని గుంటూరు పశ్చిమ మండలానికి, చేబ్రోలు తహసీల్దార్‌ షేక్‌ సుభానిను పెదనందిపాడుకు, తుళ్లూరు తహసీల్దార్‌ ఎంఎల్‌ సంజీవకుమారిను ప్రత్తిపాడుకు, జీవీఎస్‌ ఫణీంద్రబాబును వట్టిచెరుకూరు నుంచి తాడికొండకు, బి.పెంచల్‌ ప్రభాకర్‌ను తెనాలి డీఏవో నుంచి తుళ్లూరుకు, ఎస్‌.శ్రీకాంత్‌ కేదార్‌నాథ్‌ను గుంటూరు తూర్పు నుంచి పొన్నూరుకు, ఎన్‌.పూర్ణచంద్రరావును ప్రత్తిపాడు నుంచి కలెక్టర్‌ ఏవోగా, జి.సిద్ధార్థను పెదనందిపాడు నుంచి కలెక్టరేట్‌ కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా, బి.వెంకటేశ్వర్లును కాకుమాను నుంచి తెనాలి డీఏవోగా, షేక్‌ రిజ్వాన్‌ గుంటూరు తూర్పు డిప్యూటీ తహసీల్దార్‌ను ఇదే మండలానికి తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.


పల్నాడు జిల్లా తహసీల్దార్ల బదిలీలు ఇలా...

క్రోసూరు తహసీల్దార్‌ పి.రత్నంను గుంటూరు జిల్లా పెదకాకాని మండలానికి బదిలీ చేశారు. గురజాల డీఏవో కె.నాసరయ్యని వట్టిచెరుకూరుకు, శావల్యాపురం నుంచి కె.సుజాతను చేబ్రోలు మండలానికి, కారంపూడి నుంచి జె.ప్రసాదరావును కాకుమాను మండలానికి నియమించారు. కలెక్టర్‌ ఆఫీసులోని ల్యాండ్‌ మ్యాటర్స్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ పద్మాదేవిని అచ్చంపేటకు, అచ్చంపేట తహసీల్దార్‌ ఎం.క్షమారాణిని పెదకూరపాడుకు, రాజుపాలెం నుంచి కె.నగేష్‌ను సత్తెనపల్లికి, పెదకూరపాడు నుంచి ఎం.భవాని శంకర్‌ను ముప్పాళ్లకు, సత్తెనపల్లి నుంచి ఎ.శివారెడ్డిని రాజుపాలేనికి, వెల్దుర్తి నుంచి జి.శామ్యూల్‌ వరప్రసాద్‌ను బొల్లాపల్లికి, సీసీఎల్‌ఏ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న డి.మల్లికార్జునరావును యడ్లపాడుకు, గుంటూరులో స్పెషల్‌ తహసీల్దార్‌గా ఉన్న ఏవీ రమణను నాదెండ్లకు, రెంటచింతల తహసీల్దార్‌ ఎస్‌.సురేష్‌ని నకరికల్లుకు, యడ్లపాడు నుంచి జె. శ్రీనివాసరావుని రొంపిచర్లకు, రొంపిచర్ల తహసీల్దార్‌ షేక్‌ జాన్‌సైదులుని శావల్యాపురానికి, గుంటూరు పశ్చిమ తహసీల్దార్‌ తాతా మోహన్‌రావుని దాచేపల్లికి, పల్నాడు కలెక్టర్‌ ఆఫీసు సూపరింటెండెంట్‌ కె.శ్రీరాములుని మాచర్ల తహసీల్దార్‌గా, మాచవరం నుంచి కె.పుల్లారావును రెంటచింతలకు, బొల్లాపల్లి నుంచి టి.ప్రవీణ్‌కుమార్‌ను వెల్దుర్తికి, వినుకొండ నుంచి జి.అనిల్‌కుమార్‌ను పల్నాడు కలెక్టర్‌ ఆఫీసు ఏవోగా, ఈపూరు నుంచి వి.కోటేశ్వరరావుని, పల్నాడు కలెక్టర్‌ ఆఫీసు మేజిస్టీరియల్‌ సెక్షన్‌కు, ముప్పాళ్ల నుంచి ఆర్‌.యశోదని కలెక్టర్‌ ఆఫీసు కో-ఆర్డినేషన్‌ విభాగానికి, గుంటూరు జిల్లా తాడికొండ తహసీల్దార్‌ వైవీబీ కుటుంబరావును పల్నాడు కలెక్టర్‌ ఆఫీసు ల్యాండ్‌ మ్యాటర్స్‌ సెక్షన్‌కు, పెదకాకాని తహసీల్దార్‌ ఎం.డానియేల్‌ని గురజాల డీఏవోగా బదిలీ చేశారు.


బాపట్ల జిల్లాలో ఇలా....

బొప్పరాజు వెంకటేశ్వర్లుని నగరం నుంచి గుంటూరు భూసంస్కరణల స్పెషల్‌ తహసీల్దార్‌గా నియమించారు. రేపల్లె తహసీల్దార్‌ జె.విజయశ్రీని పల్నాడు జిల్లా అమరావతికి, చుండూరు నుంచి సీహెచ్‌ విజయ జ్యోతికుమారిని పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి, జి.శ్రీనివాసు నిజాంపట్నం నుంచి కారంపూడికి, బీఆర్‌సీహెచ్‌ ప్రసాద్‌ పిట్టలవానిపాలెం నుంచి పల్నాడు జిల్లా మాచవరంకు, బాపట్ల కలెక్టర్‌ ఆఫీసు సూపరింటెండెట్‌(అడ్మిన్‌) పి.మెహర్‌కుమార్‌ని అమర్తలూరుకు, నరసరావుపేట ఎంపీ పీఏ జి.శ్రీధర్‌బాబుని భట్టిప్రోలుకు, పల్నాడు జిల్లా నకరికల్లు తహసీల్దార్‌ టి.ప్రశాంతిని చెరుకుపల్లికి, మాచర్ల నుంచి జి.కేశవనారాయణని కర్లపాలెంకు, అమరావతి నుంచి ఏ.శ్రీనివాసరావుని కొల్లూరుకు, అమర్తలూరు నుంచి ఎం.స్వర్ణలతమ్మని నగరం మండలానికి, వేమూరు నుంచి ఎం.శిరీషని నిజాంపట్నంకు, చెరుకుపల్లి నుంచి సీహెచ్‌ సుధారాణిని పిట్టలవానిపాలెంకు, కొల్లూరు నుంచి పి.జాన్‌పీటర్‌ని రేపల్లెకు, మచిలీపట్నం ఎంపీ పీఏ సీహెచ్‌ శ్రీనివాసరావుని చుండూరుకు, భట్టిప్రోలు నుంచి ఎంఎల్‌ శ్రావణ్‌కుమార్‌ని వేమూరుకు, కర్లపాలెం నుంచి కె.మోహన్‌రావుని బాపట్ల కలెక్టరేట్‌ ఏవోగా, తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన బి.సుశీలని కలెక్టరేట్‌ కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌లో నియమించారు. 


 

Updated Date - 2022-07-03T04:44:49+05:30 IST