పశుసంవర్థక శాఖలో 80 మంది ఉద్యోగులు, సిబ్బంది బదిలీ

ABN , First Publish Date - 2022-07-04T05:58:31+05:30 IST

జిల్లా పశుసంవర్థక శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 80 మంది ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేశారు. ఇందులో 14 మంది ఏడీఏలు బదిలీ కాగా... వీరిలో ముగ్గురిని అంతర్‌ జిల్లాలకు బదిలీ చేశారు. అలాగే 38 మంది పశువైద్యాధికారులు బదిలీ కాగా...

పశుసంవర్థక శాఖలో 80 మంది ఉద్యోగులు, సిబ్బంది బదిలీ

కడప రూరల్‌, జూలై 3: జిల్లా పశుసంవర్థక శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి   80 మంది ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేశారు. ఇందులో 14 మంది ఏడీఏలు బదిలీ కాగా... వీరిలో ముగ్గురిని అంతర్‌ జిల్లాలకు బదిలీ చేశారు. అలాగే 38 మంది పశువైద్యాధికారులు బదిలీ కాగా... వీరిలో ఇద్దరిని ఇతర జిల్లాకు బదిలీ చేశారు. ఇతర జిల్లాల నుంచి 10 మంది ఇక్కడికి వచ్చారు. అలాగే 17 మంది ప్యారా సిబ్బందితోపాటు ముగ్గురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్‌ అసిసెంట్లు, ఒకరు గణాంకాధికారి బదిలీ అయ్యారు.

Updated Date - 2022-07-04T05:58:31+05:30 IST