ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్
పెద్దారవీడు, జనవరి 24: ప్రమాదమని తెలిసినా కూడా ట్రాన్స్ఫార్మర్కి కంచె ఏర్పాటు చేయకుండా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. పెద్దారవీడులోని గురుకుల పాఠశాలకు వెళ్లే రహదారి పక్కనే విద్యుత్ అధికారులు ఓ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రహదారి మార్గంలో నిత్యం విద్యార్థులు, రైతులు, ఉపాధ్యాయులు గ్రామంలో చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అయితే దీనికి విద్యుత్ అధికారులు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కనే మరొక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.