13, 14 తేదీల్లో గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-08-11T05:59:06+05:30 IST

వారాంత సెలవుల దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు

13, 14 తేదీల్లో గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వారాంత సెలవుల దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో  గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07653 సికింద్రాబాద్‌ - నరసపూర్‌ రైలు ఈ నెల 13న శనివారం రాత్రి 9.05 గంటలకు బయలుదేరి 1.45కి గుంటూరు, ఆదివారం ఉదయం 8.35కి నరసపూర్‌ చేరుకొంటుంది. నెంబరు. 07654 నరసపూర్‌ - సికింద్రాబాద్‌ రైలు ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.40కి గుంటూరు, సోమవారం వేకువజామున 4.10కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లలో మొత్తం 17 బోగీలుంటాయని రైల్వే అధికారి తెలిపారు. 

ప్రయాణికుల భద్రతకు ఆపరేషన్‌ యాత్రిసురక్ష..

ప్రయాణికుల భద్రత పెంపొందించేందుకు ఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ యాత్రి సురక్ష కార్యక్రమాన్ని గుంటూరు రైల్వే డివిజన్‌లో నెల పాటు పాన్‌ ఇండియా డ్రైవ్‌ని చేపట్టినట్లు రైల్వే అధికారి తెలిపారు. గత నెలలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నలుగురు అనుమానితులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 1.70 లక్షల విలువ చేసే ప్రయాణీకుల సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రయాణీకులకు సంపూర్ణ భద్రత అందించేందుకకు అనేక చర్యలు చేపట్టామన్నారు. రైలు ఎస్కార్టింగ్‌, స్టేషన్లలో పహారా, సీసీటీవీ ద్వారా నిఘా, క్రియాశీలక నేరస్థులపై విజిలెన్స్‌, నేరస్థుల గురించి వివరాల సేకరణ వంటి చర్యలు, బ్లాక్‌స్పాట్‌లపై దృష్టి కేంద్రీకరించామన్నారు


Updated Date - 2022-08-11T05:59:06+05:30 IST