Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు మీదుగా పలు ప్రత్యేక రైళ్లు

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మీదుగా పలు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజనల్‌ అధికారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు.07030 సికింద్రాబాద్‌ - అగర్తల ఈ నెల 28, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో నడపనున్నట్లు పేర్కొన్నారు. అలానే నెంబరు.07029 అగర్తల - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 24, 28 తేదీల్లో గుంటూరు మీదుగా నడుస్తుందన్నారు. అలానే నెంబరు.07455 నరసాపూర్‌ - సికింద్రాబాద్‌ డిసెంబరు 5, 12, 19, 26, నెంబరు. 07456 సికింద్రాబాద్‌ - విజయవాడ డిసెంబరు 6, 13, 20, 27, నెంబరు. 07578 మచిలీపట్నం - సికింద్రాబాద్‌ డిసెంబరు 5, 12, 19, 26, నెంబరు. 07067 మచిలీపట్నం - కర్నూలు సిటీ డిసెంబరు నెలలో ప్రతీ శని, మంగళ, గురువారం, నెంబరు. 07068 కర్నూలు సిటీ - మచిలీపట్నం డిసెంబరు నెలలో ప్రతీ ఆది, బుధ, శుక్రవారంలలో గుంటూరు మీదగా నడుపుతామన్నారు. 

 

Advertisement
Advertisement