కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా శిక్షణ

ABN , First Publish Date - 2021-04-11T05:10:29+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో నిరుద్యోగ యువతకు ఇచ్చే శిక్షణ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ అన్నారు.

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా శిక్షణ
శిక్షణ కేంద్రాన్నిపరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ

డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ

నరసన్నపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో నిరుద్యోగ యువతకు ఇచ్చే శిక్షణ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ అన్నారు. శనివారం నరసన్నపేటలోని మెహెర్‌ సాప్ట్‌వేర్‌ సెల్యూ షన్స్‌ సంస్థను ఆమె పరిశీలించారు.  ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా సంబంధిత శిక్షణ సంస్థలదేనని తెలిపారు. వృత్తి పరమైన సామర్యాలను పెంపుదించేందుకునేలా శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలో పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల, అంపోలుల్లో ఈ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-04-11T05:10:29+05:30 IST