ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తక్కువ

ABN , First Publish Date - 2022-08-19T04:58:51+05:30 IST

ప్రకృతి వ్యవసాయ విధానంలో పెట్టుబడి తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ భీమవరం జోనల్‌ కోఆర్డినేటర్‌ చింత వీరాస్వామి అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తక్కువ

పెనుగొండ, ఆగస్టు 18: ప్రకృతి వ్యవసాయ విధానంలో పెట్టుబడి తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ భీమవరం జోనల్‌ కోఆర్డినేటర్‌ చింత వీరాస్వామి అన్నారు. చినమల్లంలో రైతులు, మహిళలకు ప్రకృతి వ్యవసాయ విధానంపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దేశీ వరి, కూరగాయలకు జీవామృతం, కషాయాలు వాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టూరి సుబ్రహ్మణ్యం, మన్నె రామ్మోహనరావు, మండల ఇన్‌చార్జి బి.ఆదినారాయణ, సీఆర్‌పీలు ఉప్పలపాటి శ్రీదేవి, కె. నరేష్‌, రామలక్ష్మి,దేవి  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:58:51+05:30 IST