రైళ్ల రాకపోకల వేళల మార్పు

ABN , First Publish Date - 2020-12-05T04:45:02+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత క్రమేణా రైళ్లు రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈస్టుకోస్టు జోన అధికారులు శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) వచ్చే రైళ్ల రాకపోకల వేళల్లో మార్పు చేశారు. రైల్వేశాఖ రైళ్ల వేగం పెంచడం, రైలు ఇంజిన్లు, బోగీల నిర్వహణకు సమయం కేటాయించడంతో వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

రైళ్ల రాకపోకల వేళల మార్పు
శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) స్టేషన్‌లో నిలిచిన రైలు




ప్రకటించిన ఈస్టుకోస్టు జోన అధికారులు

ఆమదాలవలస, డిసెంబరు 4:  కరోనా వైరస్‌ నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత క్రమేణా రైళ్లు రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈస్టుకోస్టు జోన అధికారులు  శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) వచ్చే రైళ్ల రాకపోకల వేళల్లో మార్పు చేశారు. రైల్వేశాఖ రైళ్ల వేగం పెంచడం, రైలు ఇంజిన్లు, బోగీల నిర్వహణకు సమయం కేటాయించడంతో వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు జోన అధికారులు ప్రకటించారు. 

- ముంబై నుంచిభువనేశ్వర్‌ వెళ్లే (01019)కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11.10 నిమిషాలకు రావల్సి ఉండగా, సాయంత్రం 5.51 నిమిషాలకు చేరుకుంటుంది.

- బెంగళూరు నుంచి భువనేశ్వర్‌ వెళ్లే (08464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3.32 నిమిషాలకు రావల్సి ఉండగా, ముందుగానే 1.33 నిమిషాలకు చేరుకుంటుంది.

-  యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరావెళ్లే ఎక్స్‌ప్రెస్‌ (02874) సాయంత్రం 6.08 బదులు ఉదయం 7.03కు వస్తుంది. 

- హౌరా-యశ్వంత్‌పూర్‌ రైలు (02873) ఉదయం 8.13 నిమిషాలకు బదులు ఉదయం 10.12లకు వస్తుంది.

- హౌరా-సికింద్రాబాద్‌(02703) ఫలక్‌నామా రాత్రి ఏడు గంటలకు బదులు 8.15 నిమిషాలకు చేరుతుంది.

- సికింద్రాబాద్‌-హౌరా(02704)ఫలక్‌నామా ఉదయం 5.40 చేరుతుంది. 

- సికింద్రాబాద్‌- షాలిమార్‌(02774) వారాంతపు రైలు (మంగళవారం) రాత్రి 7.50 బదులు సాయంత్రం 5.23 వస్తుంది.

- సికింద్రాబాద్‌-గుహాటి (02513)ఆదివారం వీక్లీ రాత్రి 9.30 రావల్సి ఉండగా సాయంత్రం 6.31 వస్తుంది. వీటితో పాటు మరిన్ని రైళ్ల వేళలు మార్చారు.


 




Updated Date - 2020-12-05T04:45:02+05:30 IST