సీఎం పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-08-06T05:21:13+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం జిల్లాకు రానున్నారు. ఆమదాలవలసలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి.

సీఎం పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు

నేటి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 వరకు అమలు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 5:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం జిల్లాకు రానున్నారు. ఆమదాలవలసలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన జారీచేశారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీకాకుళం-పాలకొండ రోడ్డులో ఇరువైపులా ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వచ్చే అన్ని వాహనాలను, భారీ వాహనాలను రాజాం, పొందూరు, చిలకపాలెం మీదుగా శ్రీకాకుళం చేరుకోవాలి. శ్రీకాకుళం నుంచి పాలకొండ వైపు వెళ్లే వాహనాలను కొర్లకోట, అక్కులపేట, గుత్తావిల్లి, కొల్లివలస మీదుగా పాలకొండకు వెళ్లాల్సి ఉంది. శ్రీకాకుళం నుంచి కొత్తూరు వైపు ఇరువైపులా వెళ్లే వాహనాలు, భారీ వాహనాలు చింతాడ, ఎఫ్‌సీఐ రోడ్‌, రైల్వే గేటు, పురుషోత్తపురం, రొట్టవలస, సరబుజ్జిలి మీదుగా కొత్తూరు చేరుకోవాలి. కొత్తూరు నుంచి వచ్చే వాహనాలు కూడా సరుబుజ్జిలి, రొట్టవలస, పురుషోత్తపురం, రైల్వేగేటు, ఎఫ్‌సీఐ రోడ్‌, చింతాడ మీదుగా శ్రీకాకుళం చేరుకోవాలి. రాత్రి ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు గమనించి తమకు సహకరించాలని పోలీసులు ప్రకటనలో సూచించారు.  
 

Updated Date - 2022-08-06T05:21:13+05:30 IST