Advertisement
Advertisement
Abn logo
Advertisement

శభాష్ బెంగళూరు police.... 500 గుంతలు పూడ్చారు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బ తిన్నాయి. బెంగళూరు సిటీలోని పలు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ప్రయాణికులకు రోడ్ల గుంతలు ప్రమాదకరంగా మారాయి. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వర్షానికి రోడ్లపై ఏర్పడిన 500 గుంతలను పూడ్చి వేశారు. గత రెండు నెలల నుంచి బెంగళూరు సిటీలో కొన్ని ప్రధాన కూడళ్లలో రోడ్ల గుంతలను పూడ్చి వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫుట్‌పాత్‌తోపాటు బ్యాటరాయణపుర, కెంగేరి, కేఆర్ మార్కెట్, జలహళ్లితోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ పోలీసులు పూడ్చి వేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement