నల్ల చట్టాలతో ఆహార సంక్షోభం

ABN , First Publish Date - 2021-01-27T06:45:57+05:30 IST

‘దేశంలో ఆహార సం క్షోభాన్ని సృష్టించేలా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను చేసింది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, రైతులను ఆదుకునే చట్టాలను తొలగించింది. అంబానీ, ఆదానీ, కార్పొరేట్‌ సంస్థ లకు రైతుల భూములను అప్పగించేలా దాసోహం అంటోంది.

నల్ల చట్టాలతో ఆహార సంక్షోభం

కృత్రిమ ఆహార కొరతకు కుట్ర

సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, వామపక్షాల ధ్వజం 

జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 26: ‘దేశంలో ఆహార సం క్షోభాన్ని సృష్టించేలా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను చేసింది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, రైతులను ఆదుకునే చట్టాలను తొలగించింది. అంబానీ, ఆదానీ, కార్పొరేట్‌ సంస్థ లకు రైతుల భూములను అప్పగించేలా దాసోహం అంటోంది. గణతంత్ర దినోత్సవం రోజునే ఇలా దేశంలో రైతుల హక్కుల కోసం ఉద్యమం చేయాల్సి రావటం దౌర్భాగ్యం’ అని సీపీఐ, సీ పీఎం, కాంగ్రెస్‌, రైతు సంఘాల నాయకులు దుమ్మెత్తి పోశారు. నట్ట చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ పేరుతో చేపట్టిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా మంగళవారం నగరంలో ఈ పార్టీల ఆధ్వర్యంలో బళ్లారి రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. అనం తరం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, సీపీఎం రాష్ట్ర నేత ఓబులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాం భూపాల్‌, సీపీఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ములయ్య, సీపీఐ, సీపీఎం అనుబంధ రైతుసంఘాల జిల్లా కార్యదర్శులు కాటమయ్య, చం ద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి, రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానూజ మాట్లాడారు. ఇది రైతులది మాత్రమే కాదనీ, ప్రజా ఉద్యమమన్నారు. 60 రోజులుగా ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలో 40 మంది రైతులు చనిపోయినా.. ఈ ఉద్యమంలో 25 రాజకీయ పక్షాలు పాల్గొన్నా.. ఎన్‌డీఏ భాగస్వామ్యంలోని రాజకీయ పార్టీల నాయకులు పదవులకు రాజీనామా చేసి, రైతులకు అండగా నిలిచినా.. కేంద్ర ప్రభుత్వం పట్టు వీడకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లచట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమా న్ని చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు జాఫర్‌, పీ నారాయణస్వామి, శ్రీరాములు, లింగమయ్య, టీ నారాయణస్వా మి, ఏఐటీయూసీ రాజారెడ్డి, మహిళా సమాఖ్య పద్మావతి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T06:45:57+05:30 IST