పాపికొండల జలవిహారంపై నియంత్రణ లేదు

ABN , First Publish Date - 2021-12-06T05:06:56+05:30 IST

పాపికొండల పర్యాటకంపై అధికారుల నియంత్రణ కొరవడింది.

పాపికొండల జలవిహారంపై నియంత్రణ లేదు
నాడు కంట్రోల్‌ రూమ్‌

పోలవరం, డిసెంబరు 5: పాపికొండల పర్యాటకంపై అధికారుల నియంత్రణ కొరవడింది. పర్యాటకుల సౌకర్యం, భద్రత పర్యవేక్షణ నిమిత్తం లక్షలా ది రూపాయలు వెచ్చించి నిర్మించిన కంట్రోల్‌ రూంలు శిథిలం అయ్యాయి. పాపికొండల పర్యాటక అభివృద్ధికి ఏపీ టూరిజం ఐదు ప్రాంతాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేసింది. పోలవరం మండలం శింగన్నపల్లి, పేరం టాలపల్లి గ్రామాలలో ఒక్కొక్కటి రూ.22 లక్షలతో నిర్మించారు. శింగన్నపల్లి కంట్రోల్‌ రూం వరదలకు ధ్వంసం కావడంతో పోలవరం ప్రాజెక్టు పోలీస్‌ చెక్‌పోస్టు వద్దకు తరలించారు. పూర్తిగా ధ్వంసమైన కంట్రోల్‌ రూం నిరుపయోగంగా మారింది. పోశమ్మ గండి వద్ద, పోచవరం, పేరంటాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలు వరదలకు మట్టికొట్టుకుపోయాయి. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో పర్యాటకులకు విశ్రాంతి, తదితర సౌక ర్యాలు కల్పించే పరిస్థితి లేదు. పెద్ద, చిన్న వారు సైతం రూ. 1299 వెచ్చించి టూరిజం టిక్కెట్లు తీసుకుంటున్న పర్యాటకులు కనీస వసతులు లేకపోవ డంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి కంట్రోల్‌ రూంలను పునరుద్ధరించి పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

 

గత నెల 7 నుంచి పర్యాటక బోట్ల రాకపోకలకు అనుమతించడంతో పర్యాటక శాఖ, ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించాయి. పర్యాటక బోట్ల ద్వారా సుమారు రూ.4.25 లక్షలు, ప్రైవేటు బోట్లకు సుమారు రూ.65 లక్షల ఆదాయం వచ్చినట్లు అంచనా.


పర్యాటక శాఖ కంట్రోల్‌ రూంల ధ్వంసం కావడంతో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ డీఎం వీరనారాయణను వివరణ కోరగా శింగన్నపల్లి కంట్రోల్‌ రూం పునరుద్ధరణకు అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. స్విల్‌వే ఎగువన ఆప్రోచ్‌ చానల్‌ ఉండడంతో అనువైన ప్రదేశం, సామగ్రి, మేన్‌ పవర్‌ తదితర అవసరాలరు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. పోశమ్మ గండి కంట్రోల్‌ రూం వద్ద సిబ్బంది పర్యవేక్షణ ఉందన్నారు.



Updated Date - 2021-12-06T05:06:56+05:30 IST