టీడీపీ కార్యాలయాన్ని టచ్‌ చేసి చూడండి

ABN , First Publish Date - 2022-08-19T04:58:52+05:30 IST

ఆక్రమణలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తామనడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని టీడీపీ నాయకులు అన్నారు. మంత్రి అప్పలరాజుకు తమ నాయకురాలు గౌతు శిరీష క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఈ 21న టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని పేర్కొన్నారని, ఒకసారి టచ్‌ చేస్తే తమ తడాఖా చూపిస్తామని వారు హెచ్చరించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ కన్వీనర్‌ లొడగల కామేశ్వరరావు యాదవ్‌, జిల్లా కార్య దర్శి పీరుకట్ల విఠల్‌ రావు, పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌ విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ కార్యాలయాన్ని టచ్‌ చేసి చూడండి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ఆక్రమణలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తామనడం అహంకారమే..

భూ దందాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి 

టీడీపీ నాయకుల డిమాండ్‌

పలాస, ఆగస్టు 18: ఆక్రమణలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తామనడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని టీడీపీ నాయకులు అన్నారు. మంత్రి అప్పలరాజుకు తమ నాయకురాలు గౌతు శిరీష  క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఈ  21న టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని పేర్కొన్నారని, ఒకసారి టచ్‌ చేస్తే తమ తడాఖా చూపిస్తామని వారు హెచ్చరించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ కన్వీనర్‌ లొడగల కామేశ్వరరావు యాదవ్‌, జిల్లా కార్య దర్శి పీరుకట్ల విఠల్‌ రావు, పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తాము పలాస నియోజక వర్గం లో భూ ఆక్రమణలపై ప్రశ్నిస్తే తమ కార్యాలయంపై దాడు లు, ముట్టడిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వా రి అహంకార వ్యాఖ్యలకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగు రీతిలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను ఎలా గౌరవించాలో తెలియని నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారని, సర్దార్‌ గౌతు లచ్చన్న కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు శిరీష ఎదుగుదలను చూసి మంత్రి అప్పలరాజుకు భయం పట్టుకుందని, ఈ ఫోబి యాతోనే వారి కార్యకర్తలతో ప్రకటనలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. శిరీష మంత్రికి ఎందుకు క్షమాపణలు చెప్పా లని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో పలాస అభివృద్ధికి ఇచ్చిన హామీలను మంత్రి మరిచిపోయారని, వీటిని ప్రశ్నిస్తున్నారనే దారి మళ్లించేందుకు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకు న్నారని విమర్శించారు. 21న వైసీపీ నిర్వహించే ముట్టడి కార్యక్ర మా న్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా టీడీపీ సిద్ధంగా ఉందని వారన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించి కార్యక్రమాలు నిర్వహించాలని హితవు పలి కారు.  మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో గుర్తింపు పొందా లని సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు టంకాల రవిశంకర్‌గుప్తా, యవ్వారి మోహనరావు, నాబిలి శ్రీనివాస రావు, తంగుడు కిరణ్‌, డొక్కరి శంకర్‌, జోగమల్లి, రామ కృష్ణ, గోళ్ల చంద్రరావు, కుత్తుమ లక్ష్మణ్‌, దడియాల నర్సింహులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-08-19T04:58:52+05:30 IST