పూర్తి స్థాయి కర్ఫ్యూకు చేరువలో ఢిల్లీ

ABN , First Publish Date - 2022-01-03T01:12:15+05:30 IST

దేశరాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివిటీ కేసులు ఆందోళన..

పూర్తి స్థాయి కర్ఫ్యూకు చేరువలో ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశరాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివిటీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాజిటివిటీ రేటు రెడ్ అలర్ట్‌ ప్రకటించేందుకు చేరువలో ఉందని, తద్వారా ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫూ విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 3,194 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. గత ఏడాది మే 20 నుంచి ఇంత పెద్దసంఖ్యలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి. ఆదివారం 4.9 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ నిర్ధారించిన 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్' ప్రకారం రెండు రోజులు వరుసగా 5 శాతం కంటే పాజిటివిటీ రేటు నమోదైతే 'రెడ్ అలర్ట్' ప్రకటించాల్సి ఉంటుంది. అదే జరిగితే పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిపేస్తారు. గత ఏడాది మే 20న 3,231 కేసులతో 5.50 శాతం పాజిటివిటీ రేటు నమోదు కాగా, ఆ ఒక్కరోజే 233కు పైగా మరణాలు రికార్డయ్యాయి.

Updated Date - 2022-01-03T01:12:15+05:30 IST