రేపటి నుంచి ముస్లిం ఉద్యోగులకు గంట వెసులుబాటు

ABN , First Publish Date - 2021-04-13T05:56:48+05:30 IST

ముస్లిం సంప్రదాయాలు పాటించే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుధవారం నుంచి రోజువారీ పని సమయాల్లో ఒక గంటపాటు వెసులుబాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రేపటి నుంచి ముస్లిం ఉద్యోగులకు గంట వెసులుబాటు

కలికిరి, ఏప్రిల్‌ 12: ముస్లిం సంప్రదాయాలు పాటించే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుధవారం నుంచి రోజువారీ పని సమయాల్లో ఒక గంటపాటు వెసులుబాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్‌ మాసం ఆరంభం నుంచి నెల రోజుల పాటు సాయంకాలం విధుల నుంచి ఒక గంట ముందుగా వెళ్ళేందుకు అనుమతించారు. సంబంధిత ఉద్యోగులందరితో పాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లందరికీ ఈ వెసులుబాటు కల్పించారు. మే నెల 13వ తేదీ వరకూ రంజాన్‌ మాసమంతా ఇది అమల్లో వుంటుంది. ఈ మేరకు జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2021-04-13T05:56:48+05:30 IST