ములకలచెరువు మార్కెట్‌కు వచ్చిన టమోటాలు
30 కిలోల బాక్సు రూ.2వేలు
ములకలచెరువు, డిసెంబరు 3: ములకలచెరువు మార్కెట్‌లో శుక్రవారం టమోటా ధరలు మరింత పెరిగాయి. 30 కిలోల బాక్సు ధర అత్యధికంగా రూ.2వేలు పలికింది. తుఫాన్ల కారణంగా కురిసిన వర్షాలకు టమోటా పంట దెబ్బతిని దిగుబడి రావడం లేదు. డిమాండ్‌కు తగ్గ టమోటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే ఇక్కడి టమోటాలకు తమిళనాడులో డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనెల 2న గురువారం రూ.1700 పలికిన ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. నాణ్యతను బట్టి రూ.1400 నుంచి రూ.2వేల వరకు పలికింది.