మదనపల్లెలో టమోటా కిలో రూ.18
ABN , First Publish Date - 2022-01-15T05:52:06+05:30 IST
మదనపల్లె మార్కెట్ యార్డులో రోజురోజుకి టమోటా ధరలు పతనమవుతున్నాయి. వారం రోజుల క్రితం మార్కెట్లో టమోటా కిలో గరిష్ఠంగా రూ.42, కనిష్ఠంగా కిలో రూ.10 పలికింది.
మదనపల్లె టౌన్, జనవరి 14: మదనపల్లె మార్కెట్ యార్డులో రోజురోజుకి టమోటా ధరలు పతనమవుతున్నాయి. వారం రోజుల క్రితం మార్కెట్లో టమోటా కిలో గరిష్ఠంగా రూ.42, కనిష్ఠంగా కిలో రూ.10 పలికింది. అంతో ఇంతో వెనకేసుకుందామనుకున్న రైతులకు టమోటా ధరలు పతనమవుతుండటంతో ఆందోళన మొదలైంది. శుక్రవారం మార్కెట్లో టమోటా కిలో గరిష్ఠంగా రూ.18, కనిష్ఠంగా రూ.8 ధర పలికింది. అంతే కాకుండా మార్కెట్కు వారం క్రితం 200 టన్నుల టమోటా విక్రయానికి వస్తుండగా, ప్రస్తుతం 110 టన్నులు మాత్రమే వచ్చాయి. చెన్నై మార్కెట్కు స్థానికంగా రైతులు టమోటాలు విక్రయానికి తెస్తుండడంతో మదనపల్లె టమోటాకు డిమాండ్ తగ్గి, ధరలు పతనమవుతున్నట్లు తెలుస్తోంది.