President's flag: రేపు ప్రెసిడెంట్‌ ఫ్లాగ్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-07-30T14:30:45+05:30 IST

రాష్ట్ర పోలీస్‌ శాఖ(State Police Department)కు ప్రెసిడెంట్‌ ఫ్లాగ్‌ అందజేసే కార్యక్రమం ఈ నెల 31, ఆదివారం రాజారత్నం స్టేడియంలో జరుగనుంది

President's flag: రేపు ప్రెసిడెంట్‌ ఫ్లాగ్‌ వేడుకలు

                       - హాజరుకానున్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి


అడయార్‌(చెన్నై), జూలై 29: రాష్ట్ర పోలీస్‌ శాఖ(State Police Department)కు ప్రెసిడెంట్‌ ఫ్లాగ్‌ అందజేసే కార్యక్రమం ఈ నెల 31, ఆదివారం రాజారత్నం స్టేడియంలో జరుగనుంది. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ ఫ్లాగ్‌ను ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) స్వీకరిస్తారు. రాష్ట్ర పోలీస్‌ శాఖను నాలుగు రేంజ్‌లుగా విభజించి, ఒక్కో రేంజ్‌కు ఒక ఐజీ చొప్పున నియమించారు. ఈ నాలుగు రేంజ్‌ల్లో 11 సర్కిల్స్‌గా విభజించారు. అలాగే, రాష్ట్రంలో 9 పోలీస్‌ కమిషనరేట్లున్నాయి. వీటిలో చెన్నై, తాంబరం, ఆవడి కమిషనరేట్లు పోలీస్‌ డైరెక్టరేట్‌ కింద, మిగిలిన ఆరు కమిషనరేట్లు ఐజీల పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవికాకుండా, 37 పోలీస్‌, 2 రైల్వే పోలీస్‌ జిల్లాలు ఒక్కో ఎస్పీ పర్యవేణలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1305 శాంతిభద్రతల పోలీస్‌ స్టేషన్లు, 202 ఆల్‌ ఉమెన్స్‌ పోలీస్‌ స్టేషన్లు, 273 ట్రాఫిక్‌ పోలీస్‌ ఠాణాలు, 27 పోలీస్‌ హోంగార్డ్స్‌ స్టేషన్లున్నాయి. ఇవికాకుండా, సీబీసీఐడీతో ఇంటెలిజెన్స్‌, ఆర్థిక నేరాలు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇలా అనేక విభాగాలున్నాయి. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో అన్ని విభాగాల్లో కలిసి 1,31,491 మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఐపీఎస్‌ అధికారి నుంచి కానిస్టేబుల్‌ వరకు(From IPS Officer to Constable) యూనిఫాంను రాష్ట్రపతి ఫ్లాగ్‌తో ధరించేలా కొత్త యూనిఫాంను అందుబాటులోకి తెచ్చారు. ప్రెసిడెంట్‌ ప్లాగ్‌ అందజేసే కార్యక్రమానికి మూడు వేల మంది పోలీసులను భద్రతగా నియమించారు.  

Updated Date - 2022-07-30T14:30:45+05:30 IST