రేపటి నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ

ABN , First Publish Date - 2022-02-06T14:38:09+05:30 IST

మద్రాసు హైకోర్టు, హైకోర్టు మదురై బెంచ్‌ సహా అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణ జరుగనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ధనపాల్‌ ప్రకటించా

రేపటి నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ

                     - రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆదేశం


ప్యారీస్‌(చెన్నై): మద్రాసు హైకోర్టు, హైకోర్టు మదురై బెంచ్‌ సహా అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణ జరుగనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ధనపాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు 2020 మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమలుకు వచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానాలు మూసివేసి హైకోర్టులో మాత్రమే అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తులు విచారణ జరిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటిపై విచారణ జరిపేందుకు మద్రాసు హైకోర్టు అనుమతించింది. దాదాపు 21 నెలల అనంతరం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉన్న న్యాయస్థానాల్లో ఈనెల 7వ తేది నుంచి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్‌ భండారి ఆదేశాల మేరకు ప్రత్యక్ష విచారణ విధానం అమలులోకి రానుందని ఆర్జీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-06T14:38:09+05:30 IST