రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

ABN , First Publish Date - 2022-02-13T16:51:13+05:30 IST

శాసనసభ ఉభయసభల స మావేశాల ప్రారంభానికి విచ్చేయాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి, సభాపతి బసవరాజ్‌ హొరట్టి కోరారు. శనివారం వారు రాజ్‌భవన్‌లో గవ

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

                - ఉమ్మడి సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన స్పీకర్‌, సభాపతి


బెంగళూరు: శాసనసభ ఉభయసభల సమావేశాల ప్రారంభానికి విచ్చేయాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి, సభాపతి బసవరాజ్‌ హొరట్టి కోరారు. శనివారం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏటా తొలిసారి జరిగే శాసనసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే సంప్రదాయంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. సోమవారం శాసనసభ ఉభయసభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం గవర్నర్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శాసనసభ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వామ్యులవుతారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో విధానసౌధ చుట్టూ 144వ సెక్షన్‌ అమలు చేశారు. సమావేశాలు కొనసాగేంతకాలం నిబంధనలు అమలులో ఉంటాయి. శనివారం నుంచే విధానసౌధ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అన్ని ద్వారాల వద్ద స్కానర్లు ఏర్పాటు చేశారు. విధానసౌధకు వచ్చే వారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. 

Updated Date - 2022-02-13T16:51:13+05:30 IST