నేడు మెగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-07-26T05:34:03+05:30 IST

జిల్లాలో సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ అధికారులు పూర్తిచేశారు. మొత్తం లక్ష మందికి కరోనా టీకా వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకోసం 1.20లక్షల డోసుల కొవిషీల్డ్‌, ఐదువేల డోసుల కొవాగ్జిన్‌ మొత్తం 1.25లక్షల డోసులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద టీకాలు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

నేడు మెగా వ్యాక్సినేషన్‌
ఒంగోలు పీవీఆర్‌ స్కూల్లో వ్యాక్సిన్‌ కోసం బారులు తీరిన ప్రజలు

ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్యశాఖ

అందుబాటులో 1.25 లక్షల డోసులు 

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 25 : జిల్లాలో సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ అధికారులు పూర్తిచేశారు. మొత్తం లక్ష మందికి కరోనా టీకా వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకోసం 1.20లక్షల డోసుల కొవిషీల్డ్‌, ఐదువేల డోసుల కొవాగ్జిన్‌ మొత్తం 1.25లక్షల డోసులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద టీకాలు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. రెండో డోసుకు సమయమైన వారందరికీ టీకా ఇవ్వనున్నారు. 45 సంవత్సరాల వయసు దాటినవారితోపాటు, గర్భిణులు, చంటిబిడ్డల తల్లులు, 18సంవత్సరాలు దాటిని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

ఒంగోలులో తొమ్మిది కేంద్రాలు

జిల్లా కేంద్రమైన ఒంగోలులో తొమ్మిది వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థ పరిధిలోని వెంగముక్కలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల, నగరంలోని ఏబీఎం హైస్కూలు, రామనగర్‌లోని మునిసిపల్‌ స్కూలు, సరస్వతి శిశు మందిర్‌, సెయింట్‌ థెరిస్సా, ప్రకాశం, పీవీఆర్‌ బాలికలు, బాలుర హైస్కూళ్లు, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో టీకా వేయనున్నారు. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.రత్నావళి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ పి.పద్మజ ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. 


Updated Date - 2021-07-26T05:34:03+05:30 IST