నేడు లోకేష్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-12-05T06:11:22+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శనివారం జిల్లాకు రానున్నారు.

నేడు లోకేష్‌ పర్యటన
కారంచేడులో టీడీపీ నేతలతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల పరిశీలన

పర్చూరు నియోజకవర్గంలో కార్యక్రమం

ఏర్పాట్లలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కారంచేడులో పార్టీ  నేతలతో భేటీ

ఒంగోలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శనివారం జిల్లాకు రానున్నారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీ లించడంతోపాటు, రైతులను పరామర్శించనున్నారు. రైతులు అధికంగా నష్టపోయిన పర్చూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది. ఆ మేరకు శనివారం మధ్యాహ్నం స్పష్టత రాగా ఆ వెంటనే సంబంధిత ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు దృష్టి సారించారు.  లోకేష్‌ శనివారం ఉదయం తొలుత గుంటూరు జిల్లాలోని పొన్నూరు, బాపట్ల నియోజక వర్గాల్లో పర్యటించి అనంతరం పర్చూరు నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయన పర్యటనను ప్రధానంగా కారంచేడు మండలంలో ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి నిర్ణయించుకున్నారు. శనివారం 11గం టలకు కారంచేడు చేరుకునే లోకేష్‌ అక్కడ దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తారు. అనంతరం స్వర్ణ, తిమిడితపాడు, దగ్గుబాడుల్లో పర్యటిం చి పంటలకు జరిగిన నష్టాలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడతారు. సాయంత్రం పర్చూరు మీదుగా తిరిగి గుంటూరు జిల్లా లోకి వెళ్లనున్నారు. కాగా లోకేష్‌ పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్యనేతలతో ఎమ్మె ల్యే ఏలూరి శుక్రవారం సాయంత్రం చర్చించారు. కారంచేడులోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమ య్యారు. అనంతరం పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించ డంతోపాటు రైతులు, కూలీలతో మాట్లాడారు. 

Updated Date - 2020-12-05T06:11:22+05:30 IST