నేడు కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-02T10:45:47+05:30 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళ వారం కలెక్టరేట్‌ ఆవరణలో జరగనున్నాయి. ఈ వేడుకలకు అధికారులు

నేడు కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జూన్‌ 1  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళ వారం కలెక్టరేట్‌ ఆవరణలో జరగనున్నాయి. ఈ వేడుకలకు అధికారులు కలెక్టరేట్‌లో ఏర్పాట్లు  చేశారు. అధికారికంగా ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏ ర్పాట్లు చేశారు. కరోనా ప్రభావం ఉండడంతో అ న్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమై న వారినందరిని ఆహ్వానిస్తూ ఈ వేడుకలను ని ర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉదయం 9గంటలకు కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. రాష్ట్రం ఏర్ప డి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో జరిగి న అభివృద్ధిని మంత్రి వివరించనున్నారు. కరోనా ప్రభావం ఉండడంతో పరేడ్‌ గ్రౌండ్‌కు బదులు కలెక్టరేట్‌ ఆవరణలో ఈ ఏర్పాట్లు చేశారు.


ఈ అ వతరణ వేడుకలకు ఎంపీలు డి.శ్రీనివాస్‌, ధర్మపురి అర్వింద్‌, బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌గుప్తా, షకీల్‌ అమీర్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీగౌడ్‌, రాజే శ్వర్‌రావు, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విఠల్‌రావు, రెడ్‌కో చైర్మన్‌ అలీం, మేయర్‌ దండు నీతూ కిర ణ్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్‌లు బీఎస్‌లత, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరు కానునున్నారు. 


అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి అమర వీరుల స్థూపాన్ని సోమవారం పరిశీలించారు. స్థూపం వద్ద ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని సూచించారు. నివాళులు అర్పి ంచే క్రమంలో భౌతిక దూరం పాటించే విధంగా చూడాలన్నారు. వీరి వెంట డీఈ రషీద్‌ ఉన్నారు. 

Updated Date - 2020-06-02T10:45:47+05:30 IST