చీకటి పాలనకు చరమ గీతం!

ABN , First Publish Date - 2021-09-17T06:48:02+05:30 IST

నిజాంనవాబు కర్కశ, చీకటి పాలను చరమగీతం పాడేందుకు.. దేశ స్వాతంత్య్రం కోసం అగ్రభాగాన ని లిచి పోరాడిన ఇందురు బిడ్డలు తమ పేరును చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. తెలంగా ణ విమోచనోద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరా డి జైలు శిక్ష అభినుభవించిన వారిలో అత్యధికులు మోర్తాడ్‌ ప్రాంత వాసులే కావడం గమనార్హం.

చీకటి పాలనకు చరమ గీతం!

నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన మోర్తాడ్‌ ప్రాంత వీరులు

ఓరీ నిజాం పిశాచమా.. అంటూ నిజాం రాజు ఎదుట తన గళాన్ని వినిపించి జిల్లా జైలులో శిక్ష అనుభవించిన కవి దాశరథి

నేడు తెలంగాణ విమోచన దినం

మోర్తాడ్‌, సెప్టెంబరు 16: నిజాంనవాబు కర్కశ, చీకటి పాలను చరమగీతం పాడేందుకు.. దేశ స్వాతంత్య్రం కోసం అగ్రభాగాన ని లిచి పోరాడిన ఇందురు బిడ్డలు తమ పేరును చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. తెలంగా ణ విమోచనోద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరా డి జైలు శిక్ష అభినుభవించిన వారిలో అత్యధికులు  మోర్తాడ్‌ ప్రాంత వాసులే కావడం గమనార్హం. మో ర్తాడ్‌కు చెందిన సోషలిస్టు లింబాగిరి, దుత గంగా రాంలు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున యువకులను సమీకరించి క ర్రసాము నేర్పించారు. ఈ ప్రాంతానికి చెందిన చౌట్‌ పల్లి హన్మంత్‌రెడ్డి కూడా విమోచన ఉద్యమంలో చు రుగ్గా పాల్గొన్నారు. ఉద్యమానికి ఆర్ధిక సహాయం చేసి ప్రజల మన్ననాలు అందుకున్నారు. పాలెం గ్రామాని కి చెందిన బద్దం చిన్నారెడ్డి విమోచన ఉద్యమంలో కీ లకపాత్ర పోషించారు. 1947లో హైదరాబాద్‌లో నిర్వ హించిన రాష్ట్ర విమోచన దినోత్సవంలో పాల్గొని జైలు శిక్ష అనుభావించారు. చిన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా ను 1973లో ప్రభుత్వం తామ్రపాత్రం ఇచ్చి ఆయనను సన్మానించింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో ర జాకార్లతో పోరాడిన వారిలో మోర్తాడ్‌ మండలానికి చెందిన రాజమల్లారెడ్డి(మోర్తాడ్‌), ముస్కు నారాయ ణ(సుంకెట్‌), బోగ చిన్నయ్య, అంబల్ల నర్సింలు, తిరు పతి రామనుజం, రిక్క గంగారాం, సడాక్‌ రాములు వీరందరూ మోర్తాడ్‌ వాసులే, లోక గోపాల్‌రెడ్డి (ధర్మో రా), శెట్‌పల్లికి చెందిన నాయిబాలయ్య, రాజలిం గం, బద్దం లింగారెడ్డి, నాయి సాయన్న ఉన్నా రు. ఇలా ఉద్యమంలో పాల్గొని త్యాగాలు, బలి దానాలు చేసి చరిత్ర పు టల్లోకి ఎక్కిన వారు కొ ందరైతే చరిత్రకు అంద ని వారు మరెందోరు ఉ న్నారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో, మొన్నటి వి మోచన ఉద్యమంలో 1969 ప్రత్యేక ఉద్యమంలో అగ్ర భాగాన ఉండి ప్రాణత్యాగాలు చేసిన త్యాగాల గడ్డ మోర్తాడ్‌ చరిత్ర తనకంటూ ఒక పేజీని కేటాయిం చుకుంది. 

ఝాన్సీలక్ష్మీబాయి సమకాలీకుడు రాజా రుక్మారెడ్డి  

ఇందూరు జిల్లాకు తెలంగాణలో వీరగడ్డగా పేరుంది. అందులో మోర్తాడ్‌.. పోరుగడ్డగా, ఉద్యమాలకు పు ట్టిల్లుగా, త్యాగాలకు నిలయంగా పేరొందింది. నాడు నిజాం కర్కశపాలనలో ఉంటూ బ్రిటీష్‌ సామ్రాజ్యా న్ని కూలదోయడానికి.. తొలిభారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర వహించిన జమీందర్‌ గడ్డం రుక్మారెడ్డి మోర్తాడ్‌ వాసి. మోర్తాడ్‌ జమిందర్‌కు కొంత సై న్యం ఫిరంగులు, గోల్కోండ నవాబు తానీషా పాలన లో ఈవ జమీందారులుగా కొనసాగారు. మోర్తాడ్‌ జ మీందర్‌ కింద 50కిపైగా గ్రామాలు ఉండేవి.  1830 లో జన్మించిన రుక్మారెడ్డి ప్రథమ స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు ఝాన్సీలక్ష్మీబాయికి సమకాలికులు. 30 ఏళ్ల వయసులో కౌలాస రాజు దిలిప్‌సింగ్‌తో కలిసి మహారాష్ట్రలో ఎన్నో పోరాటాలు చేశారు. ఈ క్రమం లోనే బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా రుక్మారెడ్డితో పా టు పోరాడిన కౌలాసరాజు జమీందరీ తనం కోల్పో యారు. అప్పటి స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన రుక్మారెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ బ్రిటి ష్‌ ప్రభుత్వం నిజం నవాబుకు ఆదేశించింది. దీంతో రుక్మారెడ్డిని ఇనుప సంకేళ్లతో బంధించి అనేక రకాలు గా నిజాంనవాబు హింసించారు. అంతటితో అగకుం డా రుక్మారెడ్డి తండ్రి జమీందర్‌ నర్సింహరెడ్డి ఆదీనం లో ఉన్న భూములు, గ్రామాలను నిజాం ప్రభుత్వం తగ్గించింది. ఎట్టకేలకు నిజాం ప్రభుత్వం రుక్మారెడ్డిని వృద్ధాప్యంలో విడుదల చేసింది. అప్పటి వరకు ఆయ న జైల్లోనే దుర్భర జీవితాన్ని అనుభావించారు. 

ఓరీ నిజాం పిశాచమా.. 

కానరాడు నిన్ను బోలిన రక్కసి 

మాకెన్నడేమి.. వీరులను బలిసి 

అగ్నిలో దింపినావూ నా తెలంగాణ 

కోటి రతనాల వీణ!

నిజాం ప్రభుత్వానికి, రాజుకు వ్యతిరేకంగా అప్పటి వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా లో.. అదీ నిజాం రాజు సమక్షంలోనే తన గళాన్ని వినిపించారు కవి దాశరథి. ఫలితంగా నిజాం ప్రభు ఆగ్రహానికి గురై, నిజామాబాద్‌ జిల్లా ఖిల్లాకు తరలించబడ్డాడు. 

మూగబోయిన కోటి తమ్ముల గళాల

నోట పలికించు కవితారు జమ్ముకూర్చి.. 

నా కలాలకు బలమునిచ్చి నడిపించినట్టి 

నా తెలంగాణ కోటి రతనాల వీణ!!

..అంటూ ఖిల్లా గోడలమీద లిఖించాడు. 

జిల్లాలో 1938 సంవత్సరం నుంచి రజాకార్లు రెచ్చిపోయారు. రజాకార్ల నాయ కుడు ఖాసింరజ్వీ ఆధ్వర్యంలో సైనికులు, ప్రజలను తీవ్రంగా హింసించారు. మ హిళలు కనిపిస్తే చాలు.. అత్యాచారాలు జరిపారు. వివస్త్రలను చేసి కర్కశంగా హింసించారు. గృహదహనాలు, హత్యలు, లూటీలు ప్రజల్ని భీతావాహుల్ని చేశా యి. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ మాత్రం ని జాంపాలనలోనే కొనసాగింది. ఈ సమయంలో నిజామాబాద్‌లో రజాకార్ల ఆగ డాలు తారాస్థాయికి చేరాయి. వీరి ఆగడాలను ఎదిరించేందుకు ఆర్యసమాజ్‌ వ లంటరీ దళాలు, కమ్యూనిస్టులు తీవ్రంగా కృషి చేశారు. జిల్లాకు చెందిన రాధాకి షన్‌ మోదానీని 1939లో రజ్వీ మూకలు, నగర ఒకటో టౌన్‌ సమీపంలో హత్య చేశారు. దీంతో నిజాంపాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు.. తెలంగాణ సాయు ధ పోరాటం చేశారు. అదే సమయంలో ఆర్యసమాజ్‌ జెండా కింద అనేక మంది యువకులు ఏకమై.. రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించారు. దీంతో వారిని అణిచి వేసేందుకు వందల సంఖ్యలో ఉద్యమకారుల్ని నిజాం పాలకులు జైల్లో పెట్టారు. జిల్లాకు చెందిన ఎం.జి గంగారాం, జి.రామక్రిష్ణ, ఆర్‌.శెట్టి, గుండారెడ్డి, వడ్ల నరసి మ్ములు, లక్క కిష్టయ్య, చేపూర్‌ అంజయ్య లాంటి వారెందరో నెలల తరబడి జైళ్లో మగ్గిపోయారు. వీరి తర్వాత అంబటి శంకర్‌ లాంటి వారెందరో రజాకార్లతో ఎదురొడ్డి పోరాడారు.  - నిజామాబాద్‌ కల్చరల్‌

కామారెడ్డి జిల్లాదీ ఘనమైన చరిత్ర

కామారెడ్డి: తెలంగాణ సాయుధ పోరాటంలో కామారెడ్డి చరి త్ర ఎంతో ఘనమైనది. ఎంతో మంది సాయుధ పో రాట యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిం చారు. కత్తి పోటును సైతం లెక్క చేయకుండా జాగో ప్రజా.. భాగో నిజాం.. అన్న రాధాకృష్ణ మోదావి ఇక్క డి వాడే. కన్నవారిని.. పుట్టిన ఊరిని వదిలి నిజాంను ఎదురించిన నర్సింహారెడ్డి, సర్దార్‌ ప్రేమ్‌సింగ్‌, పణి హారం రంగాచారి, రాజారెడ్డి వంటి ఎందరో ఉద్యమ వీరులు పోరాట స్ఫూర్తిని నింపి జిల్లాకే గర్వకారణం గా మారారు.  ఉద్యమంలో భాగంగా కామారెడ్డి పట్ట ణానికి చెందిన ఫణిహారం రంగాచారి ఒక రు. 1946 నుంచి 1951 వరకు హైదరాబాద్‌ సంస్థానంలో ని జాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకార్ల రాక్షసత్వం, భూస్వాముల దోపిడీపై, వెట్టి చాకిరి చట్ట విరుద్ధ పనులకు వ్యతిరేకంగా భూమి కోసం బానిస బతుకుల విముక్తి కోసం సాగిన పోరాటాన్ని చారిత్రా త్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన దేశ చరిత్రలోనే అసమానమైనవి. 10 లక్షల ఎకరాల భూములు ఆనాడు పేదలకు పంచడం జరిగింది. ఈ చారిత్రక పోరాటంలో సుమారు 4వేల మంది పోరా టవీరులు అ మరులైనట్లు చరిత్ర చెబుతోంది. కామా రెడ్డి పట్టణానికి చెందిన ఫణిహారం రంగాచారి మ ధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి లక్ష్మణాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అదే పాఠశాల లో చదువుకున్న రంగాచారి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం సాధించారు.  

Updated Date - 2021-09-17T06:48:02+05:30 IST