గౌరీపరమేశ్వరులు
అనకాపల్లి టౌన్, జనవరి 28: అనకాపల్లి గవరపాలెం గౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేకువజామున నాలుగు గంటలకు సతకంపట్టులోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు.