Abn logo
Apr 21 2021 @ 00:19AM

కర్ణాటకలో 97 మిలియన్లు పొగాకు ఉత్పత్తి

వచ్చే సీజన్‌కు అనుమతించిన పొగాకు బోర్డు 

రాష్ట్రంలో వేలం తీరుపై విస్తృత చర్చఒంగోలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : కర్ణా టకలో వచ్చే సీజన్‌(2021-22)కు 97 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమ తిచ్చింది. ఆ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన పొగాకు బోర్డు పాలకమండలి 153వ సమావేశంలో తీర్మానించారు. కరోనా తీవ్రత నే పథ్యంలో పాలకమండలి సమావేశాన్ని వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. గుంటూ రులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబా బు, వైస్‌ చైర్మన్‌ గుండాల కొండారెడ్డి, బోర్డు ఎ గ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబులతో పా టు మరో ఇద్దరు, ముగ్గురు సభ్యులు సమావే శంలో పాల్గొనగా ఇతర సభ్యులు ఆయా ప్రాం తాల నుంచి  పాల్గొన్నారు. రానున్న సీజన్‌లో 100 మిలియన్ల కొనుగోలుకు అవకాశం ఉందని, ఆ మేరకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని పొ గాకు వ్యాపారుల సంఘం బోర్డు దృష్టికి తీసు కెళ్ళింది. కర్ణాటక ప్రాంత రైతులు, వారి ప్రతిని ధులు గతేడాది తొలుత ఇచ్చినట్లుగా 99 మిలి యన్లు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే సీజన్‌కు కర్ణాటకలో 97 మిలియన్‌ కిలోల పం టసాగుకు అనుమతి ఇస్తూ తీర్మానించారు.


ఆంధ్రాలో కొనుగోళ్లపై అసంతృప్తి


ప్రస్తుతం ఆంధ్రా మార్కెట్‌లో పరిస్థితులు, కొనుగోళ్ల తీరు, వ్యాపారుల వైఖరి తదితర అం శాలపై కూడా బోర్డు సమావేశంలో విస్తృతంగా నే చర్చ సాగింది. మొత్తంగా వేలం ప్రారంభం లో ఉన్న ధరలు, మార్కెట్‌లో ఉన్న పోటీ వాతా వరణం ప్రస్తుతం లేకపోగా రైతులు అసంతృప్తి లో ఉన్న విషయాన్ని బోర్డు వైస్‌ చైర్మన్‌ కొండా రెడ్డి, ఇతర ప్రతినిధులు, కొందరు అధికారులు కూడా సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు సమా చారం. ప్రధానంగా ఎక్స్‌పోర్టు కంపెనీలు కొను గోళ్లపై ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువ పరి మాణం కొనుగోలు చేస్తున్న ఐటీసీ ధరలను త గ్గించడంతో రైతులు నష్టపోతున్నారన్న అభిప్రా యం వ్యక్తమైంది. విదేశీ ఆర్డర్లు ఖరారు వరకు రాష్ట్రంలో వేలం ప్రక్రియ నిలిపేయడమా లేక రోజువారీ బేళ్ల సంఖ్యను తగ్గించడమా అన్న దానిపై కొంత చర్చ సాగింది. రైతులు, క్షేత్రస్థా యి అధికారుల అభిప్రాయాలను కూడా తెలు సుకొని దీనిపై రెండు, మూడు రోజుల్లో ఒక ని ర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడినట్లు స మాచారం. అలాగే వచ్చే సీజన్‌కు రాష్ట్రంలో పొ గాకు రైతులకు ఎరువుల సరఫరా, బ్యారన్ల ఇ న్సూరెన్స్‌ ఇతర పలు అంశాలపై కూడా చర్చిం చినట్లు తెలుస్తోంది.


 

Advertisement
Advertisement
Advertisement